రేపటినుంచి విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉదయం 6 నుంచి ఉదయం 9 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతిస్తున్నట్లు.. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పదేపదే పోలీసులు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు ఏదో కారణంతో రోడ్లపైకి వస్తున్నారన్న ఆయన... ఇప్పటికైనా పరిస్థితిని అర్థం చేసుకుని తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే చాలామంది గుంపులుగా తిరుగుతున్నారన్న ఆయన... చాలామంది భౌతికదూరం పాటించడం లేదని తమ దృష్టికి వస్తోందని తెలిపారు. మరింత కట్టుదిట్టంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ నేతలు కూడా నిబంధనలు పాటించాలని కోరారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
'ఉదయం 9 గంటల వరకే అనుమతి..అతిక్రమిస్తే చర్యలే'
సంచాల దుకాణాల ద్వారా నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవాలని విజయవాడ సీపీ ప్రజలకు సూచించారు. రేపటినుంచి విజయవాడలో ఉదయం 6నుంచి 9 గంటల వరకే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. నిత్యావసరాల కోసం ప్రజలు పదేపదే బయటకు రావొద్దని సూచించారు. అనుమతి తీసుకుని మాత్రమే బయటకు రావాలని హెచ్చరించారు. రాజకీయ నేతలు కూడా నిబంధనలు పాటించాలని కోరారు.
vijayawada cp thirumala rao