విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు హెచ్చరించారు. నగరంలోని 64 డివిజన్లకు, ఉయ్యూరు నగర పంచాయతీలోని 18 వార్డులకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 788 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 74 అతి సమస్యాత్మక, 61 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు సీపీ ప్రకటించారు.
'ఎన్నికల ప్రక్రియకు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు'
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల కోసం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు నగర సీపీ బి. శ్రీనివాసులు వెల్లడించారు. రౌడీషీటర్లు, అనుమానితులను గుర్తించి బైండోవర్ చేశామని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విజయవాడ నగర సీపీ బి.శ్రీనివాసులు
గత ఎన్నికలలో నేరచరిత్ర కలిగినవారు, అనుమానితులైన మొత్తం 1,897 మందిపై సీఆర్పీసీ కింద బైండోవర్ చేశామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.