Vijayawada CP: రౌడీషీటర్లతో మాట్లాడిన విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా.. వారి సమస్యలు పరిష్కరించాలని ఓ ఆలోచన చేశారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్తో కలిసి సంయుక్తంగా రౌడీషీటర్లకు జాబ్‌మేళా నిర్వహించారు. ఇందులో వందలమంది యువత, రౌడీషీటర్లు పాల్గొన్నారు. మొత్తం 16 కంపెనీలు వీరికి జాబ్ ఆఫర్ చేయడానికి వచ్చారు.
రౌడీషీటర్లకు జాబ్ మేళా.. ఎక్కడంటే?
Vijayawada CP: రౌడీషీటర్లలో మార్పు తేవడానికి విజయవాడ సీపీ ఓ వినూత్న ఆలోచన చేశారు. వారి సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. అందుకోసం రౌడీషీటర్లకు జాబ్‌మేళా నిర్వహించారు.
రౌడీషీటర్లకు జాబ్ మేళ నిర్వహించిన విజయవాడ సీపీ
విజయవాడలో రౌడీషీటర్ల సమస్య ఎప్పటినుంచో ఉందని సీపీ కాంతిరాణా టాటా అన్నారు. వారితో మాట్లాడే సమయంలో సమస్యలు అర్థంచేసుకున్నానని చెప్పారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. జీవితాలు మార్చుకునేందుకు చాలామంది ముందుకొచ్చారని వెల్లడించారు. పాత జీవితాన్ని వదిలి సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని రౌడీషీటర్లకు సీపీ సూచించారు.
ఇదీ చదవండి:చేనేత రంగంపై జీఎస్టీ పెంపు వెనక్కి తీసుకోండి.. కేంద్రానికి లోకేశ్ లేఖ