దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై నమోదైన కేసును కొట్టేస్తూ విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు నిచ్చింది. 2011లో ఓ మహిళపై చింతమనేని దాడిచేసి కొట్టారంటూ ఏలూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 324, 341, 352, 354 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. కేసులో నేరం రుజువు చేయటానికి సరైన సాక్ష్యాదారాలు లేవంటూ కోర్టు కేసును కొట్టేసింది.
చింతమనేనిపై నమోదైన కేసును కొట్టేసిన న్యాయస్థానం - చింతమనేనిపై నమోదైన కేసు కొట్టేసిన న్యాయస్థానం
2011లో ఓ మహిళపై చింతమనేని ప్రభాకర్ దాడిచేసి కొట్టారంటూ నమోదైన కేసును కొట్టేస్తూ విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు నిచ్చింది. కేసులో నేరం రుజువు చేయటానికి సరైన సాక్ష్యాదారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది.
చింతమనేనిపై నమోదైన కేసు కొట్టేసిన న్యాయస్థానం