ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజకీయాల అడ్డాలో ఒకప్పుడు ఆ పార్టీలు చక్రం తిప్పాయి.. మరి ఇప్పుడు..? - ఆంధ్రప్రదేశ్ లోకల్ ఎలక్షన్స్ వార్తలు

అక్కడ ఒకప్పుడు చక్రం తిప్పిన పార్టీలు.. ఇప్పుడు ప్రాభవం కోల్పోయాయి. డివిజన్లలో నిలబడితే చాలు గెలుపు దిశగా దూసుకెళ్లే పార్టీలు.. ఉనికి కోల్పోయాయి. ఒకప్పుడు సునాయసంగా మేయర్ పీఠం దక్కించుకుని.. తర్వాతి కాలంలో ఆ జోరు చూపించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సమీకరణాలు మారే బెజవాడలో కాంగ్రెస్-వామపక్షాల పరిస్థితి ఇది..! పుర పోరు సమీపిస్తున్న తరుణంలో విజయవాడ నగరపాలక సంస్థ రాజకీయ ప్రాశస్త్యం ఒకసారి చూద్దాం.

vijayawada corporation political history
vijayawada corporation political history

By

Published : Feb 28, 2021, 2:28 PM IST

రాజకీయాల అడ్డాలో ఒకప్పుడు ఆ పార్టీలు చక్రం తిప్పాయి.. మరి ఇప్పుడు..?

ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవడం అనే సామెత బెజవాడ నగరపాలక సంస్థ రాజకీయాలకు అద్దం పడుతుంది. అప్పట్లో మేయర్‌ పీఠం కోసం.. నువ్వానేనా అంటూ పోటీ పడిన వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ.. ప్రస్తుతం ఉనికి కోల్పోయాయి. గతంలో ప్రత్యక్ష ఎన్నికల్లోనూ మేయర్‌ పీఠం దక్కించుకుని.. పాలకపగ్గాలు చేపట్టాయి. నగరపాలక సంస్థకు ఇప్పటివరకు 6 సార్లు ఎన్నికలు జరిగితే, రెండు సార్లు వామపక్షాలు,2 సార్లు కాంగ్రెస్‌ అధికారం దక్కించుకున్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో తెలుగుదేశం ఒకసారి మేయర్‌ పీఠం గెలవగా.. మరోసారి పూర్తి మెజారిటీతో పాలకపక్షంగా అవతరించింది. 2000లో కాంగ్రెస్‌ మేయర్‌ స్థానం కోల్పోయినా,అత్యధిక డివిజన్లు గెలుచుకుని పాలకవర్గంగా చెలామణి అయింది.

ఇలా,ఆరు సార్లు జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు పాలకులుగా అవతరించిన అందించిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో ఒక్క డివిజన్‌నూ దక్కించుకోలేకపోయాయి. గతంలో నగరపాలనలో బలమైన ముద్రవేసిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ పార్టీ.. ఈసారి నామమాత్రంగా పోటీ చేస్తున్నాయి. సీపీఐ తెలుగుదేశం మద్దతుతో కేవలం ఆరు డివిజన్లలోనే పోటీ చేస్తుండగా.. పాతబస్తీలో 3 డివిజన్లలో బరిలో దిగుతోంది. సీపీఎం 21 స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. కాంగ్రెస్‌ ఒంటరిగా 40 డివిజన్లలో పోటీకి దిగుతోంది. ఈసారి.. కనీస సంఖ్యలో అయినా స్థానాల్ని గెలుచుకుని కౌన్సిల్లో అగుడుపెట్టేందుకు 2 పక్షాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి.

2000వ సంవత్సరంలో తెలుగుదేశం మేయర్‌ పీఠం దక్కించుకున్నా.. కాంగ్రెస్‌ మాత్రం అత్యధికంగా 25 డివిజన్లలో గెలుపొంది, పాలకపక్షంగా వ్యవహరించింది. 2005లో 59 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో, కాంగ్రెస్‌, సీపీఐ-సీపీఐం కలిసి పోటీచేసి అత్యధిక డివిజన్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్‌ 32,మిత్రపక్షాలైన సీపీఎం, సీపీఐ 17 స్థానాల్ని దక్కించుకున్నాయి. ఒప్పందం ప్రకారం

మేయర్‌ పదవిని సీపీఐ ఏడాది, కాంగ్రెస్‌ నాలుగేళ్లు చేపట్టింది. 2014లో జరిగిన ఎన్నికల్లో 59 డివిజన్లకు గానూ.. తెలుగుదేశం అత్యధికంగా 37 డివిజన్లు గెల్చుకుని మేయర్‌ పీఠం కైవసం చేసుకుంది. వైకాపా 19 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. సీపీఎం కేవలం ఒక్క డివిజన్‌లో మాత్రమే గెలుపొందగా.. భాజపా, స్వతంత్ర అభ్యర్థులు చెరో స్థానం దక్కించుకున్నారు. సీపీఐ, కాంగ్రెస్‌ పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ... ఓటమి చవిచూశాయి. ఈ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగిస్తామని తెలుగుదేశం ధీమాతో ఉంది. బెజవాడ నగరపాలక ఎన్నికల్లో వైకాపా రెండోసారి తలపడుతుండగా.. భాజపా మద్దతుతో జనసేన తొలిసారి ఎన్నికల బరిలో అదృష్టం పరీక్షించుకుంటోంది.

ఇదీ చదవండి:

ఈశాన్యం నుంచి వేడిగాలులు..రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ABOUT THE AUTHOR

...view details