ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అనవసరంగా బయటికి వస్తే క్రిమినల్ చర్యలు'

నగర వాసుల బాధ్యతారాహిత్యం కారణంగానే విజయవాడలో కేసుల సంఖ్య పెరుగుతోందని నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. విజయవాడ గుణదల సమీపంలోని పడవలరేవు కూడలిలో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో కమిషనర్ పాల్గొన్నారు.

vijayawada corona cases
vijayawada corona cases

By

Published : Apr 29, 2020, 4:22 PM IST

విజయవాడ నగరంలో కేసుల తీవ్రత పెరగడానికి కారణం నగరవాసుల నిర్లక్ష్యమేనని కమిషనర్ తిరుమల రావు తెలిపారు. నగరంలోని పడవలరేవు కూడలిలో ప్లాగ్ మార్చ్ లో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఎవరూ అనవసరంగా రోడ్లపైకి రావద్దని కమిషనర్ సూచించారు. నగరంలో చాలా ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయని గుర్తుచేశారు. ముఖ్యంగా యువకులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని క్వారంటైన్ కి తరలిస్తున్నామన్న సీపీ... ఇకపైనా ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితపై పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details