విజయవాడలో విదేశాల నుంచి వచ్చిన ఒక యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ మేరకు కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రకటన చేశారు. ఈనెల 17, 18న హోమ్ ఐసోలేషన్లో ఉన్న యువకుడు.. జ్వరం రావడం వల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. నమూనాలను పరీక్షలకు పంపగా.. కరోనా ఉన్నట్లు తేలిందని చెప్పారు. యువకుని ఇంటి చుట్టుపక్కల 500 ఇళ్లల్లో సర్వే చేసినట్లు పేర్కొన్నారు. స్థానికులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ 3 రోజుల్లో యువకుడు, అతని కుటుంబ సభ్యులు ఎవరెవరితో మాట్లాడారో ఆరా తీస్తున్నామని కలెక్టర్ తెలిపారు. యువకుడు హైదరాబాద్ నుంచి వచ్చిన క్యాబ్ గురించి కూడా ఆరా తీస్తున్నామని అన్నారు. కరోనాపై ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే కంట్రోల్ రూం నెంబర్ 79952 44260కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఏప్రిల్ 14 వరకూ 144 సెక్షన్