అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరావతి జేఏసీకి మద్దతుగా నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరిన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావును గృహనిర్బంధం చేశారు. అమరావతి నిరసనలో పాల్గొనేందుకు వెళ్తున్న నరహరిశెట్టికి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించేవరకు తమ నిరసన కొనసాగిస్తామని నరహరిశెట్టి అన్నారు.
విజయవాడలో కాంగ్రెస్ నేత నరహరిశెట్టి గృహ నిర్బంధం - విజయవాడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు హౌస్ అరెస్ట్
అమరావతి జేఏసీకి మద్దతుగా నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరిన విజయవాడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు
ఇదీ చదవండి:అమరావతికి మద్దతుగా అండమాన్లో నిరసన దీక్ష