అందంగా, అమాయకత్వంగా కనిపించే ఆ పిల్లోడు డ్యాన్స్ చూస్తే.. హీరోలా అనిపిస్తుంది. కాలు కదిపితే.. వావ్ అనిపిస్తోంది.. అతడే విజయవాడకు చెందిన కృష్ణ చైతన్య.. చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్త పాశ్చాత్య నృత్య పోటీల్లో మూడో విజేతగా గెలిచాడు. ఇండియా నుంచి ఒకే ఒకడిగా నిలిచాడు.
అమెరికాలోని స్టెప్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పాశ్చాత్య నృత్య పోటీల్లో కిడ్స్ విభాగంలో పాల్గొన్నాడు కృష్ణ చైతన్య. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా దినేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, రుఎల్ మాస్టర్ వ్యవహరించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా పోటీల్లో ఎవరి ఇంటి వద్ద నుంచి వారే పాల్గొన్నారు. ఈ చిన్నోడి విజయం వెనక, తల్లిదండ్రులు ప్రోత్సాహం, గురువు శిక్షణ ఎంతో ఉంది.