సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు మొత్తంగా 310 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ కంట్రోలర్ జీఎస్ ఆర్ కే మూర్తి తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ నెల 14 వరకు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ధరల్లో 40 శాతం రాయితీ కల్పించినట్లు తెలిపారు.
'విజయవాడ - హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో 40 శాతం రాయితీ'
సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్ రద్దీగా మారింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
'విజయవాడ-హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో 40 శాతం రాయితీ'