ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీసీని ప్రధాన మంత్రి చేస్తే సరిపోదు: ఆర్​.కృష్ణయ్య

బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్​ కల్పించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​. కృష్ణయ్య డిమాండ్​ చేశారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వైకాపా ప్రభుత్వం బిల్లు పెట్టాలని కృష్ణయ్య కోరారు.

By

Published : Jul 2, 2021, 5:05 PM IST

R Krishnayya
ఆర్​ కృష్ణయ్య

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్​ కల్పించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.​ కృష్ణయ్య డిమాండ్​ చేశారు. ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. బీసీ అయిన నరేంద్ర మోదీని ప్రధాన మంత్రి చేశామని భాజపా చెబుతోందని, కానీ అది ఒక్కటే సరిపోదని అన్నారు.

దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో స్థానం కల్పించే వరకు రాజీలేని పోరాటం చేస్తామంటూ కేంద్రాన్ని హెచ్చరించారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వైకాపా ప్రభుత్వం బిల్లు పెట్టాలని కృష్ణయ్య కోరారు. వైకాపా బిల్లు పెడితే ఇతర పార్టీల మద్దతు కూడగట్టే పని తాము చేస్తామని అన్నారు. ఈమేరకు విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

ఇదీ చదవండి:Perni nani : పామర్రు బస్టాండ్​ను పరిశీలించిన మంత్రి పేర్ని నాని

ABOUT THE AUTHOR

...view details