ఏప్రిల్ 3న నిలిచిపోయిన విదేశీ విమాన సర్వీసులు(InterNational Flights) రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరైక్టర్ మధుసూధనరావు చెప్పారు. సాయంత్రం దుబాయ్ నుంచి తరలిరానున్న ప్రత్యేక విమానంతో సర్వీసులు ప్రారంభం కానున్నాయన్నారు. మొదటి విడతలో సుమారు 500 విమానాల ద్వారా 55 వేల మంది ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకున్నారని చెప్పారు. వందేభారత్ మిషన్లో భాగంగా ఈ సర్వీసులు కొనసాగుతాయన్నారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో విమాన ప్రయాణాలు కొనసాగనున్నట్లు చెప్పారు.
గల్ఫ్ దేశాలైన మస్కట్, సింగపూర్, కువైట్ నుంచి నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇప్పటికే ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా అంతర్జాతీయ టెర్మినల్ భవనంలో కొవిడ్ సౌలభ్యం కోసం మార్పులు, చేర్పులు చేపట్టామన్నారు. మరోవైపు విజయవాడ నుంచి డిపార్చర్ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. జులై నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
InterNational Flights: 'రేపటి నుంచి వందేభారత్ మిషన్ విదేశీ సర్వీసులు ప్రారంభం ' - international services starts vijayawada airport
రేపటి నుంచి వందే భారత్ మిషన్ విదేశీ సర్వీసులు(InterNational Flights) ప్రారంభం కానున్నట్లు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ మధుసూధనరావు తెలిపారు. మొదటి విడతలో ఈ సర్వీసుల ద్వారా 500 విమాానాల వరకు రాష్ట్రానికి చేరుకున్నాయన్నారు. విజయవాడ నుంచి డిపార్చర్ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
vijayawada airport