గణతంత్ర వేడుకలు విశాఖ నుంచి విజయవాడకు వచ్చినట్లుగానే రాజధాని కూడా విశాఖ నుంచి అమరావతికి తిరిగొస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు, మహిళలపై పోలీసులు పాశవికంగా ప్రవర్తిస్తున్నారన్నారు. 29 గ్రామాల ప్రజల్ని పశువులు బాదినట్లు బాదారని ఆవేదన వ్యక్తం చేశారు. 24 మంది రైతులు చనిపోయినా...జగన్, ఆయన మంత్రుల్లో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించటం లేదన్నారు. గల్లా జయదేవ్ ఎంపీ అని కూడా చూడకుండా తప్పుడు సెక్షన్లు మోపి, హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని, ఇతర మంత్రుల భాష తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. విజయసాయిరెడ్డికి, వైవీ. సుబ్బారెడ్డికి మండలిలో ఏం పని అని ప్రశ్నించారు.
'విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి మండలిలో ఏం పని ?' - దేవినేని ఉమా వార్తలు
విజయసాయిరెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి మండలిలో ఏం పని అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గణతంత్ర వేడుకలు విశాఖ నుంచి విజయవాడకు వచ్చినట్లుగానే, రాజధాని కూడా విశాఖ నుంచి అమరావతికి తిరిగొస్తుందన్నారు.
దేవినేనిఉమా