ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయ బ్రాండ్​తో నిత్యావసర వస్తువులు.. వారంలోగా రిటైల్ స్టోర్లలో అమ్మకాలు - ap Oil Ped reday to supply groceries

విజయ బ్రాండ్ పేరుతో నిత్యావసర వస్తువులు అందించేందుకు ఏపీ ఆయిల్​ ఫెడ్ సిద్ధమైంది. వారం రోజుల్లో.. ఆయా వస్తువులు రిటైల్ స్టోర్లలో రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

Vijaya brand groceries
విజయ బ్రాండ్ పేరుతో నిత్యావసర సరకులు

By

Published : Jul 4, 2021, 5:57 PM IST

విజయ బ్రాండ్ పేరుతో మూడు దశాబ్దాలకు పైగా వంట నూనెలు అందిస్తున్న ఏపీ ఆయిల్ ఫెడ్.. ఇకపై నిత్యావసర వస్తువులు అందించేందుకు సిద్ధమైంది. బాస్మతి బియ్యం, కందిపప్పు, దాల్చిన చెక్క, రాయలసీమ రాగి పిండి సహా... వివిధ రకాల వంటింటి నిత్యవసర వస్తువులు అందించనున్నట్లు ఏపీ ఆయిల్ ఫెడ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంతనాథ్ రెడ్డి చెప్పారు. ఆయా వస్తువులను ప్రిన్సిపల్ సెక్రెటరీ మధుసుధన్ రెడ్డితో కలిసి లాంఛనంగా విడుదల చేశారు.

మరో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో రిటైల్ దుకాణాల ద్వారా విక్రయిస్తామని వెల్లడించారు. బయట స్టోర్లలో నాణ్యమైన నిత్యావసర వస్తువులు దొరకట్లేదని శ్రీకాంతనాథ్ రెడ్డి అన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా నాణ్యమైన వస్తువులనే తాము అందిస్తున్నామని.. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details