ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నీరు- చెట్టుపై విజిలెన్స్​ విచారణ - neeryu-chettu

నీరు-చెట్టు అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

నీరు - చెట్టు పై శాసనసభలో చర్చ

By

Published : Jul 25, 2019, 2:17 PM IST

గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన నీరు- చెట్టు పథకంపై శాసనసభలో చర్చ జరగింది. ‘నీరు-చెట్టు’ పథకంలో భారీ దోపిడీ జరిగిందని వైకాపా సభ్యుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. తెదేపా సభ్యులు అడ్డగోలుగా దోచుకున్నారని మండిపడ్డారు. నీరు-చెట్టులో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరిపించాలని కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారంపై విచారణ పూర్తయ్యేవరకు బిల్లులు మంజూరు చేయొద్దన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. నీరు-చెట్టు పథకంలో రూ. 22వేల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో తెదేపా కార్యకర్తలకు నిధులను దోచి పెట్టారని మంత్రి మండిపడ్డారు. నీరు-చెట్టు అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

నీరు - చెట్టు పై శాసనసభలో చర్చ

ABOUT THE AUTHOR

...view details