ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Gandhitopi Governor book: చరిత్రలోని వాస్తవాలపై మరింత పరిశోధన జరగాలి: వెంకయ్య - book Gandhitopi Governor

venkaiahnaidu released Gandhitopi Governor Book: పరాయి పాలకుల ఏలుబడిలో వక్రీకరణకు గురైన మన దేశ చరిత్రను వాస్తవ అంశాలతో సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ‘గాంధీ టోపీ గవర్నర్’ పుస్తకాన్ని న్యూఢిల్లీ ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ పటేల్ సమావేశ ప్రాంగణంలో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

VP Venkaiah released book Gandhitopi Governor
గాంధీటోపీ గవర్నర్ పుస్తక అవిష్కరణ

By

Published : Dec 16, 2021, 7:05 AM IST

Vice President Venkaiahnaidu on indian history: మన దేశ చరిత్రలోని వాస్తవాలపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పరాయి పాలకుల ఏలుబడిలో వక్రీకరణకు గురైన చరిత్రను వాస్తవ అంశాలతో సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిటిష్‌ పాలనలో సెంట్రల్‌ ప్రావిన్స్‌ ప్రైమినిస్టర్‌గా, గవర్నర్‌గా పనిచేసిన ఈడ్పుగంటి రాఘవేంద్రరావు జీవితచరిత్రపై ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ రచించిన ‘గాంధీ టోపీ గవర్నర్‌’ పుస్తకాన్ని బుధవారం ఉపరాష్ట్రపతి నివాసంలో ఆయన ఆవిష్కరించారు.

‘ఒకసారి చరిత్రను గమనిస్తే ఎక్కడైనా అభిప్రాయ బేధాలు సహజమన్న విషయం స్పష్టమవుతుంది. భిన్నాభిప్రాయాలపై సమగ్రంగా చర్చించి, నచ్చజెప్పి బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవాలే తప్ప, భుజ బలం వాడడం సరైన పద్ధతి కాదు. ఒకప్పుడు చట్టసభల్లో పదునైన విమర్శలు ఉండేవి. ఆ విమర్శలను అధికారంలో ఉన్న వారు సానుకూలంగా స్వీకరించేవారు. చట్టసభ సభ్యులు, బ్యూరోక్రాట్లు ఎవరైనా ఆదర్శంగా నడుచుకోవాలి. ఇప్పుడు కొందరు చట్టసభలో ఉన్నామనే ఆలోచన కూడా లేకుండా ప్రతికూలంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం చింతించకుండా చేసిన పనులను సమర్థించుకునే స్థితికి చేరారు. ఈ తరహా వ్యక్తులను మీడియా ప్రోత్సహించకూడదు. చట్టసభల్లో జరిగే అర్ధవంతమైన చర్చలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత ఆవశ్యకం’ అని వెంకయ్యనాయుడు సూచించారు.

భారతదేశం అమృతోత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో సమరయోధుల జీవితాలకు సంబంధించిన పుస్తకాలు అన్ని భాషల్లో యువతకు అందుబాటులోకి తీసుకు రావలసిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడు, పుస్తక రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, తమిళనాడు పూర్వ గవర్నర్‌ పి.ఎస్‌. రామ్మోహన్‌ రావు, ఎమెస్కో బుక్స్‌ సి.ఈ.ఓ. విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

ap debts: కొత్త రుణాల అనుమతి కోసం నిరీక్షిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details