VP Venkaiah in Chetana Foundation Services: కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్ ప్రాంగణంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఫౌండేషన్ సహకారంతో పేద మహిళల ఆర్థిక స్వాలంబన కోసం కుట్టుమిషన్లు, గ్రామాల్లోని పేదల స్వయం ఉపాధిలో భాగంగా నిరుపేద చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా చేతన ఫౌండేషన్ సేవలను వెంకయ్యనాయుడు అభినందించారు.
Vice President venkaiah naidu: చేతన ట్రస్టు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు.. - Chetana Foundation services at Swarna Bharathi Trus
Vice President venkaiah naidu: కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్ ప్రాంగణంలో పలువురికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సేవ కార్యక్రమాలు నిర్వహించారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్లు, తోపుడు బండ్లు, విద్యార్థులకు సైకిళ్లను వెంకయ్య అందజేశారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు సేవ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అభిలషించారు. విదేశాల్లో ఉండి భారతదేశంలో పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చేతన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెనిగళ్ల రవి, రేణుక దంపతులు, ఉప్పుటూరి రాంచౌదరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు వెనిగళ్ల వెంకటేశ్వరరావు, ఫౌండేషన్ సభ్యులు ఉప్పుటూరి మహాలక్ష్మి, ముత్తినేని. సురశ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం : వెంకయ్య నాయుడు