venkaiah naidu:రాజకీయ నాయకులకు నైతిక విలువలు ఉంటేనే.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాల వజ్రోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆకలి, అవినీతి, లింగ వివక్ష లేనప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లని పేర్కొన్నారు. లింగ వివక్షను రూపుమాపేందుకు అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు.
రాజకీయ నాయకులకు నైతిక విలువలుండాలి : వెంకయ్యనాయుడు - west godavari latest news
Vice President: ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాల వజ్రోత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఆకలి, అవినీతి, లింగ వివక్ష లేనప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లని పేర్కొన్నారు.
సి.ఆర్.రెడ్డి కళాశాల వజ్రోత్సవాల్లో ఉపరాష్ట్రపతి
ఎన్ని భాషలు నేర్చుకున్నా.. మాతృభాషకు అత్యున్నత స్థానం ఇవ్వాలని సూచించారు. దేశంలో 23 శాతం నిరక్షరాస్యత ఉందని పేర్కొన్నారు. చరిత్ర పుస్తకాల్లో మన దేశ నాయకుల పేర్లు లేవని, వాటిని మార్చి రాయాల్సి ఉందని అన్నారు. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఇతర దేశాలపై దాడులు చేయడం వల్ల ప్రపంచ శాంతి కనుమరుగువుతుందని తెలిపారు.