వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణహితం దృష్ట్యా మిద్దెతోట అనేది ఓ చక్కని ఆలోచన అని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో నగర సేద్యం నిపుణులు, రచయిత తుమ్మేటి రఘోత్తమ్‌రెడ్డి రాసిన "టెర్రస్ గార్డెన్" ఉపశీర్షిక మిద్దెతోట ఆంగ్ల పుస్తకం ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వై. వెంకటేశ్వరరావు, టెర్రస్ గార్డెన్ పుస్తక రచయిత రఘోత్తమ్‌రెడ్డి పాల్గొన్నారు. గతంలో తెలుగు బాషలో రాసిన ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించి అన్ని వర్గాల కుటుంబాలకు చేరువ చేసే ప్రయత్నాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు.
మిద్దెతోట ఓ చక్కని ఆలోచన...
"ఇది చిన్న కార్యక్రమం అయినా.. ఈ ఆలోచన చాలా పెద్దది. ఎంతో ఉపయుక్తమైంది. నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలు తమ డాబాలు, బహుళ అంతస్తుల భవనాలపైన, ఇళల్లోని ఖాళీ స్థలాల్లో పెరటి తోటలు సాగు చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా మంచి సహజ పోషకాహారం లభిస్తుంది. ఆర్థిక లబ్ధియే కాకుండా నచ్చిన మెచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినవచ్చు. కరోనా నేపథ్యంలో దిల్లీలో ఉపరాష్ట్రపతి భవన్‌లో 450 మీటర్లతో మేం కూడా ఒక తోట పెంచాం. అందులో నా సతీమణితో కలిసి నడిచేటప్పుడు... కూరగాయలు చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. మా సొంతూరిలో ఉన్నామన్న భావన కలుగుతుంది" - వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి.
పంచసూత్ర ప్రణాళిక..