VC venkaiah AP Tour: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేటి నుంచి 19వ తేదీ వరకు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. నేడు ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
18వ తేదీ ఉదయం ట్రస్టులో వివిధ వృత్తి విద్యా కోర్సులో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమవుతారు. 19న ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారు.