స్వర్ణ భారతి ట్రస్ట్ (Swarna Bharati Trust) 20వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు జిల్లాల్లో ఉచిత కొవిడ్ టీకా శిబిరాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Vice President Venkaiah) వర్చువల్‌గా ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ పాల్గొన్నారు. భారత్ బయోటెక్ ఆధ్వర్యంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా పదివేల ఉచిత కొవిడ్ టీకాలు (Covid Vaccine) వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దీపా వెంకట్ తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని సూచించారు.
"స్వర్ణ భారతి ట్రస్ట్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపు ప్రారంభించాం. నెల్లూరులో 3,500, విజయవాడలో 1,000, హైదరాబాద్లో 500 మందికి టీకాలు అందించాం. ఉపరాష్ట్రపతి వెంకయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత రెండేళ్లుగా ప్రపంచం కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కేంద్రప్రభుత్వం కొవిడ్ సంక్షోభాన్ని సమర్థవంతగా ఎదుర్కొంటుంది. దాదాపుగా అందరికీ టీకాలు ఇస్తున్నారు." -దీపా వెంకట్, వెంకయ్య కుమార్తె