ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వివేకా కేసులో సునీత వాస్తవాాలు దాస్తున్నారు! - SUNITHA

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీత ప్లేటు ఫిరాయించి, వాస్తవాలను మరుగున పరుస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఆరోపించారు.

By

Published : Mar 27, 2019, 11:01 PM IST

వివేకా హత్య కేసులో సునీత వాస్తవాాలను దాస్తుంది : వర్ల రామయ్య
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఆయన కూతురు సునీత ప్లేటు ఫిరాయించారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు.వాస్తవాలను మరుగున పరుస్తున్నారని ఆరోపించారు.కుటుంబపరంగా చాలా విషయాలు తెలుసుకున్న సునీత.. వాటినిఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. సిట్ ముందు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. హైకోర్టులో పిటిషన్ వేయించడం రాజకీయం కాదా అని ప్రశ్నించారు. సిట్ దర్యాప్తు నివేదిక ఇవ్వకూడదని ఎలా అంటారన్నారు. ఇంటి దొంగలు బయటకు వస్తే జగన్ రాజకీయానికి ఇబ్బంది వస్తుందని వాస్తవాలు దాస్తున్నారని ఆరోపించారు. సిట్ అధికారులు పాత్రికేయుల ముందు మాట్లాడకూడదని ఎలా చెబుతారని మండిపడ్డారు. కడప ఎస్పీబదిలీని ఆహ్వనిస్తున్నామని అంటున్న మీకు... ఆయన చేసిన అన్యాయం ఏమిటని ప్రశ్నించారు. వాస్తవాలు చెప్పకుండా ఎస్పీబదిలీని సమర్ధించడం సబబు కాదని హితవు పలికారు. హత్యాస్ధలంలో దొరికిన ఉత్తరం వివేకా రాసినదేనని చెప్పిన సునీత, నేడు నిపుణుల నివేదిక రావాలని ఎందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌ డైరెక్షన్లోకి వెళ్ళి సునీత వాస్తవాలను దాచాలని అనుకుంటున్నారని మండిపడ్డారు.

ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details