విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించి మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. ఫలితంగా నగర శివారు ప్రాంతాల్లో అక్రమ విక్రయాలు జోరందుకున్నాయి. జక్కంపూడి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలోని ఓ చికెన్ షాప్ యజమాని.. చనిపోయిన, గాయాలపాలై అత్యంత దారుణ స్థితిలో ఉన్న కోళ్లను అమ్మకానికి పెట్టారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పురపాలక శాఖ అధికారులు దుకాణాదారునిపై కేసు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న మాంసం దుకాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చనిపోయిన కోళ్ల విక్రయం... ప్రజారోగ్యంతో చెలగాటం - విజయవాడ వార్తలు
కరోనా నేపథ్యంలో విజయవాడ రెడ్‌జోన్ ప్రాంతాల్లో అధికారులు మాంసం విక్రయాలు పూర్తిగా నిషేధించారు. ఫలితంగా నగర శివారు ప్రాంతాల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చనిపోయిన, గాయాలతో ఉన్న కోళ్లను విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
విజయవాడలో మృతిచెందిన కోళ్ల విక్రయం