విజయవాడకు చెందిన విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ భారత జట్టు(ఆర్చరీ)లో చోటు దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ కప్ పోటీలకు ఇండియన్ టీంకు క్రీడాకారులను ఎంపిక చేసేందుకు దిల్లీలో ఓపెన్ సెలక్షన్స్ నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సెలక్షన్స్లో 12 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరిలో వెన్నం జ్యోతి స్థానం దక్కించుకుంది. వీరికి ఫిబ్రవరి నెలాఖరులో మరోసారి సెలక్షన్స్ నిర్వహించి దేశం తరఫున ఆడేందుకు నలుగురిని ఎంపిక చేయనున్నారు. 2,880 పాయింట్లకు గాను జ్యోతిసురేఖ 2,767 పాయింట్లు సాధించింది.
భారత ఆర్చరీ జట్టుకు అడుగు దూరంలో వెన్నం జ్యోతి - జ్యోతి సురేఖ వెన్నం నేటి వార్తలు
ప్రపంచకప్ పోటీలకు ఆర్చరీ విభాగంలో క్రీడాకారులను ఎంపిక చేసేందుకు దిల్లీలో ఓపెన్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో విజయవాడకు చెందిన విలువిద్య క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ అర్హత సాధించింది. ఆమెతో పాటు అర్హత సాధించిన వారందరికీ ఫిబ్రవరి నెలాఖరులో మరోసారి సెలక్షన్స్ నిర్వహించనున్నారు.
భారత ఆర్చరీ జట్టుకు అడుగు దూరంలో వెన్నం జ్యోతి