విజయవాడలో ట్రెండ్ సెట్‌కి వెంకీమామ చిత్రబృందం రావడంతో సందడి నెలకొంది. వెంకీమామ చిత్రం విజయవంతం కావడంపై చిత్ర బృందమంతా ఆనందం వ్యక్తం చేశారు. అక్కినేని నాగచైతన్యతో తాను కలిసి నటించాలనే తన తండ్రి రామానాయుడు కోరిక ఈ సినిమాతో విజయవంతం అయిందని హీరో వెంకటేశ్ చెప్పారు. విజయవాడలో వరుసగా 60 ఆటలు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఆడటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ చిత్రంగా ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఈ సినిమా చూడటమే ఈ చిత్ర విజయానికి కారణమన్నారు. మహేష్‌బాబుతో సినిమా చేశానని, ఇప్పుడు చైతన్యతో, భవిష్యత్తులో అందరి హీరోలతో కలిసి నటిస్తానని వెంకటేశ్ చెప్పారు. విజయోత్సవ సందర్భ కార్యక్రమాలు ఎప్పుడూ హైదరాబాద్‌లోనే నిర్వహించడం జరుగుతుందని... ఈ సినిమా సక్సెస్ మీట్ విజయవాడలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని నాగచైతన్య అన్నారు. ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో ఆడటంపై ప్రేక్షకులకు ముఖ్యంగా వెంకటేశ్, అక్కినేని అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కథానాయిక పాయల్ రాజ్‌పుత్ ఆనందం వ్యక్తం చేశారు.
అందరి హీరోలతో నటిస్తా: హీరో వెంకటేశ్ - Venki_Maama_Success_Meet in vijyawada
వెంకీమామ చిత్రం విజయవంతం కావటంతో చిత్ర బృందం విజయవాడలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హీరోలు వెంకటేశ్, చైతన్య హీరోయిన్ పాయల్, దర్శకుడు బాబీ పాల్గొన్నారు.
![అందరి హీరోలతో నటిస్తా: హీరో వెంకటేశ్ Venki_Maama_Success_Meet in vijyawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5446083-448-5446083-1576914726596.jpg)
వెంకీమామ చిత్ర బృందం