ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భాషా సంస్కృతులే పునాదులు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వాడుక భాష ద్వారా అందరికీ విజ్ఞానం అందాలని గిడుగు ఉద్యమించారని కొనియాడారు. తెలుగుభాషను కాపాడుకోవటమే గిడుగుకు మనం అందించే నివాళి అని పేర్కొన్నారు. యువతకు సంస్కృతి, మాతృభాష చేరువ చేయడం ప్రతి ఒక్కరీ బాధ్యత అని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు.
'ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భాష-సంస్కృతులే పునాది' - గిడుగు రామ్మూర్తిపై వెంకయ్య ప్రశంసలు న్యూస్
గిడుగు జయంతి, తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా అంతర్జాల సదస్సు నిర్వహించారు. 'మన భాష-మన సమాజం-మన సంస్కృతి' పేరుతో సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
'ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భాషా సంస్కృతులే పునాది'