కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తెస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో.. మార్పు చేర్పులకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గెజిట్ నోటిఫికేషన్‌పై బోర్డు సమావేశం నేపథ్యంలో అందులో అనుమతిలేని ప్రాజెక్టుగా పేర్కొన్న వెలిగొండపై కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది.
CS Letter: 'వెనెగోడును.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా పేరు మార్చండి' - పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా మార్చాలని కేంద్రానికి సీఎస్ లేఖ తాజా వార్తలు
21:00 August 31
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా మార్చాలని కేంద్రానికి సీఎస్ లేఖ
ఏపీ పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో వెనెగోడు ప్రాజెక్టు పేరును పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా మార్పు చేయాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. గెజిట్ జారీ దృష్ట్యా అత్యవసరంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి సవరణ నోటిఫికేషన్ జారీ చేయాలని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
Buggana:'పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించా'