ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చదువుల తల్లికి స్వర హారతి.. విజయవాడలో వైభవంగా కచ్ఛపీ మహోత్సవం - veena concert news in vijayawada

వారందరూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు. అందరూ కలిసి త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలతో చదువుల తల్లికి స్వర హారతులిచ్చారు. సుమారు 14 గంటల పాటు నిర్విరామంగా వీణ వాయిస్తూ అఖండ కచ్ఛపీ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

చదువుల తల్లికి స్వర హారతి.. విజయవాడలో వైభవంగా కచ్ఛపీ మహోత్సవం
చదువుల తల్లికి స్వర హారతి.. విజయవాడలో వైభవంగా కచ్ఛపీ మహోత్సవం

By

Published : Feb 16, 2020, 4:42 AM IST

స్వర హారతితో అలరించిన సంగీత విద్వాంసులు

విజయవాడ ఘంటశాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో శ్రీ సుబ్రహ్మణ్య మహతీ సంగీత సమితి ఆధ్వర్యంలో... నాలుగో వార్షిక అఖండ కచ్ఛపీ మహోత్సవం వైభవంగా జరిగింది. సరస్వతీ దేవి ముద్దుబిడ్డలుగా అఖండ కీర్తి గడించిన వైణిక విద్వాంసుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు నిర్విరామంగా వీణాధారిణి అయిన సరస్వతీ దేవికి నాదహారతి పట్టారు. తెలుగు రాష్ట్రాల విద్వాంసులే కాకుండా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల విద్యాంసులు వీణానాదంతో సరస్వతీదేవికి స్వరహారతులిచ్చారు.

ఆదరణ తగ్గుతోంది

సంగీతంలో వాద్యత్రయం అయిన వీణ, వేణు, మృదంగాల్లో... సరైన సహకారం, ప్రోత్సాహకాలు లేని కారణంగా ఆదరణ తగ్గుతోందని... వీటిపై ప్రజలకు ఆసక్తి కలిగించడానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్వాంసులు చెబుతున్నారు. భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరికీ సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుందన్నారు. సుబ్రహ్మణ్య మహతీ సంగీత సమితి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి.... వాద్యత్రయం ప్రాశస్త్యాన్ని విస్తరిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

చిన్నారుల చదువుకోసం... సైకిల్ పై సవారీ..!

ABOUT THE AUTHOR

...view details