ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

టీ కొట్టు యజమానిపై మంత్రి వెల్లంపల్లి అనుచరుల వీరంగం - విజయవాడ వార్తలు

టీ కొట్టు యజమానిపై మంత్రి వెల్లంపల్లి అనుచరుడు, వక్ఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్ ఖాజా అనుచరులు వీరంగం సృష్టించారు. డబ్బులు ఇవ్వాలని టీ కొట్టు యజమానిపై దౌర్జన్యానికి దిగారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించడంతో దాడి చేశారని బాధితుడి ఆవేదన వ్యక్తం చేశారు.

vellampally followers attack on tea shop owner form money
vellampally followers attack on tea shop owner form money

By

Published : Jul 18, 2021, 2:13 PM IST

'డబ్బులివ్వాంటూ దాడికి పాల్పడ్డారు'

విజయవాడ భవానీపురంలో మంత్రి వెల్లంపల్లి అనుచరుడు, వక్ఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్ ఖాజా అనుచరులు వీరంగం సృష్టించారు. షేక్ దావుద్ అనే టీ కొట్టు వ్యాపారిపై దాడికి పాల్పడ్డారు. టీ దుకాణం యజమాని షేక్ దావుద్​ను ఖాజా అనుచరులు డబ్బులు ఇవ్వాలని దౌర్జన్యం చేయటంతో... డబ్బులు ఎందుకు ఇవ్వాలని టీ కొట్టు వ్యాపారి ప్రశ్నించాడు. ఖాజా అనుచరులు దుర్భాషలాడి, దాడికి పాల్పడినట్లు బాధితుడు భవానిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయొద్దంటు ఖాజా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఫిర్యాదు దారుడుని బెదిరింపులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడికి చూస్తు ఉండిపోయారు.

ABOUT THE AUTHOR

...view details