సంక్రాంతి పండుగకు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వస్తున్న ప్రయాణికుల వాహనాలు జాతీయ రహదారిపై బారులు తీరుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై వరుసగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండటం.. నందిగామ సమీపంలోని కీసర టోల్గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నప్పటికీ రద్దీ ఎక్కువగా ఉండటంతో వేచి ఉండక తప్పటం లేదు. టోల్ ప్లాజా నిర్వాహకులు వాహనాలు ఎక్కువ సేపు వేచి ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఒక్కో వాహనం 10 నుంచి 20 నిమిషాల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.
గతం కంటే మెరుగైన పరిస్థితి..