రవాణాశాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్య కారణంగా... రాష్ట్రవ్యాప్తంగా షో రూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీనివల్ల నూతన వాహనాలు కొనుగోలు చేసే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరగనున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు కోసం వాహనదారులు భారీగా రావడంతో వెబ్‌సైట్‌పై ఒత్తిడి ఏర్పడి సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
రవాణాశాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్య...నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్లు - vehicle registrations stopped
16:22 December 30
డెలివరీ లేక పలుచోట్ల డీలర్లతో కొనుగోలుదారుల వాగ్వాదం
వాహనం డెలివరీ చేయకపోవడంతో పలు చోట్ల డీలర్లతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన రవాణాశాఖ ఉన్నతాధికారులు... రేపటి కల్లా వెబ్సైట్లో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. రేపు ఉదయం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామని తెలిపారు. వాహనదారులు ఇప్పుడు కొనుగోలు చేసిన వాహనాలకు జనవరి 1 తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. ప్రస్తుత పన్నులనే చెల్లించేలా అవకాశం కల్పించినట్టు తెలిపారు. దీనికోసం జనవరి 1కి ముందు వాహనం కొనుగోలు చేసినట్టు తగిన ధృవపత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు.
ఈ ఆదేశాన్ని ఇప్పటికే వివిధ జిల్లాల రవాణాశాఖ అధికారులు, డీలర్లకు తెలిజేసినట్టు మంత్రి వెల్లడించారు. వాహనదారులు ఆందోళన చెందవద్దని కోరారు.
ఇదీచదవండి.