ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అయ్యన్న కేసును సుమోటోగా తీసుకుంటాం: వాసిరెడ్డి పద్మ - అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు వార్తలు

మహిళా అధికారిని వేధించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేయడంలో జాప్యం ఎందుకని విశాఖ జిల్లా ఎస్పీని వివరణ అడిగినట్లు మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారని వెల్లడించారు.

vasireddy padma comments on ayyannapathrudu
vasireddy padma comments on ayyannapathrudu

By

Published : Jun 20, 2020, 7:06 PM IST

మహిళా మున్సిపల్ కమిషనర్​ను తిట్టిన అయ్యన్నను చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెడుతున్నారంటూ గవర్నర్​కు తెదేపా ఫిర్యాదు చేయడం శోచనీయమన్నారు. మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ అయితే అయ్యన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. మహిళలను అవమానించినా.. దూషించినా నిర్భయ చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని.. రాజకీయ రంగు పులిమితే మహిళలు భరించాలా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

అయ్యన్న కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటోందని.. ఆయనను అరెస్ట్ చేయించి తీరతామని స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి గన్​మ్యాన్​.. ఆయన కుమార్తె-అల్లుడుపై చేసిన దాడి వ్యవహారాన్ని కూడా మహిళ కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు.

ఇదీ చదవండి: కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని.. మంత్రిగారి గన్​మ్యాన్​ వీరంగం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details