మహిళా కమిషన్ ఎక్కడెక్కడ పర్యటిస్తోందో తెదేపా నేతలు వాట్సాప్ గ్రూపుల్లో ముందుగానే తెలియజేస్తూ.. మహిళలను రప్పించారని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. తెదేపా నేతలు వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. మహిళల పేరిట రాజకీయం చేయడం తెదేపా నేతలకు తగదని హితవు పలికారు. మహిళలను ముందు పెట్టి, వారిని పావులుగా ఉపయోగించుకుంటున్నారన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపే వాతావరణం లేకుండా తెదేపా నేతలు చేస్తున్నారని విమర్శించారు.
'మహిళల పేరిట రాజకీయం చేయడం తగదు' - తెదేపాపై వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు న్యూస్
జాతీయ మహిళా కమిషన్ను తెదేపా నేతలు పక్కదోవ పట్టించారని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. మహిళల పేరిట రాజకీయం చేయడం తగదని అన్నారు. రాజధానిలో హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు.
'మహిళల పేరిట రాజకీయం చేయడం తగదు'