ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఘనంగా ముగిసిన దుర్గమ్మ వసంత నవరాత్రి ఉత్సవాలు - దుర్గమ్మ గుడిలో వసంత నవరాత్రులు

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు తొమ్మిది రోజులుగా పుష్పార్చనలు జరిగాయి. వసంత నవరాత్రులు ముగియగా.. చివరి రోజున కనకాంబరాలు, గులాబీలతో అమ్మవారికి ఘనంగా అర్చన చేశారు.

vijayawada kanakadurga temple, vasanta navaratrulu in durga temple
విజయవాడ కనకదుర్గ ఆలయం, ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు

By

Published : Apr 21, 2021, 7:49 PM IST

అమ్మవారికి కనకాంబరాలతో అర్చన

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. జగన్మాత కనకదుర్గమ్మకు గత తొమ్మిది రోజులుగా.. వివిధ రకాల పుష్పాలతో అర్చన చేస్తున్నారు. చివరి రోజున కనకాంబరాలు, గులాబీలతో అమ్మవారికి అర్చన జరిపారు.

ఇదీ చదవండి:బియ్యం గింజలతో సీతారాముల చిత్రపటం

గోశాల ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు ఆయా పుష్పాలను తీసుకొచ్చి.. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య రుత్విక్కులు అమ్మవారికి పుష్పార్చన చేశారు. అనంతరం పంచహారతులు సమర్పించారు. ఉభయదాతలకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి.. శేషవస్త్రాలు, ప్రసాదాలు అందించారు.

ఇదీ చదవండి:

ఈ నెలాఖరుతో ‘ఇసుక’ పొరుగు సిబ్బంది తొలగింపు

ABOUT THE AUTHOR

...view details