ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VARLA: రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది: వర్ల రామయ్య - తెదేపా నేత వర్ల రామయ్య

రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఆరోపించారు. దీనిపై జాతీయ మానవహక్కుల సంఘానికి లేఖ రాశానని వెల్లడించారు. వివేకా హత్య కేసులో హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరిగేలా చూడాలని వర్ల కోరారు. లేదంటే దర్యాప్తులో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థమయ్యే పరిస్థితి ఉండట్లేదని ఆరోపించారు.

వర్ల రామయ్య
వర్ల రామయ్య

By

Published : Aug 3, 2021, 4:50 PM IST

Updated : Aug 3, 2021, 5:06 PM IST

వర్ల రామయ్య

రాష్ట్రంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై విచారణ జరిపించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జాతీయ మానవ హక్కుల కమిషన్​కు లేఖ రాశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ "రాష్ట్రంలో మానవహక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆర్టికల్ 19ను దుర్వినియోగం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడా నిరసనలు జరపటానికి వీలు లేకుండా ఇనుపపాదం మోపేలా భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నారు. డీజీపీ గౌతం సవాంగ్ కు రాజ్యాంగం గురించి, ఆర్టికల్ 19గురించి తెలిసి కూడా ఎక్కడా నిరసనలు తెలపకుండా గృహనిర్భందాలు పేరుతో అడ్డుకుంటున్నారు. చంద్రబాబు వాహనంపై దాడికి యత్నస్తే ఆర్టికల్ 19గురించి గొప్పగా మాట్లాడిన సవాంగ్ కు.. తెదేపా నేతల విషయంలో వర్తించదా. నిత్యం హరించబడుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ హెచ్.ఎల్.దత్తుకు లేఖ రాశాను. రాష్ట్రానికి ప్రత్యేక బృందాన్ని పంపి విచారణ జరిపించాలని కోరాను. వివేకా హత్య కేసు విచారణపై రోజువారీ పర్యవేక్షణ ఉండాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతున్నా. హత్య కేసులో ఎంతోమంది పెద్దల పాత్ర ఉన్నందున అసలు ముద్దాయిలకు శిక్షపడాలనదే మా అభిలాష. వివేకా హత్యపై సీబీఐ విచారణ ప్రారంభమై రెండేళ్లయినా ఏం జరుగుతోందనే తెలియట్లేదు. సిట్టింగ్ జడ్జి పరిశీలనలో విచారణ జరగకపోతే వివేకా కుటుంబానికి న్యాయం జరగదు." అని వెల్లడించారు.

ఇదీ చదవండి:

GRMB MEETING: అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేం: ఏపీ ఈఎన్​సీ

Last Updated : Aug 3, 2021, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details