ఈ నెల 24న రమ్య కేసులో విచారణకు గుంటూరు వస్తున్న జాతీయ ఎస్సీ కమిషన్ను కలవడం కోసం తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అపాయింట్‌మెంట్ కోరారు. ఆ రోజున గుంటూరులో కమిషన్ సభ్యులను కలిసి వైకాపా ప్రభుత్వంలో దళితవర్గాలపై జరుగుతున్న దాడులు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించి సాక్షాలతో సహా కమిషన్ ముందుంచేందుకు సమయం కేటాయించాలని గుంటూరు జిల్లా కలెక్టరును మెయిల్ ద్వారా వర్ల అభ్యర్థించారు.
ఎస్సీ కమిషన్ కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరిన వర్ల రామయ్య - vijayawada news
ఈ నెల 24న రమ్య కేసు విచారణకు గుంటూరు వస్తున్న ఎస్సీ కమిషన్ను కలిసేందుకు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అపాయింట్‌మెంట్ కోరారు. ఎస్సీలపై జరుగుతున్న దాడులపై వారికి వివరించేెందుకు ఇలా చేసినట్లు తెలిపారు.
వర్ల రామయ్య