ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసుల చరిత్రలో మార్చి 12 ఓ చీకటిరోజు: వర్ల రామయ్య - ముఖ్యమంత్రి వల్లే డీజీ హైకోర్టులో ఆరు గంటలు ఉండాల్సి వచ్చిందన్న వర్ల రామయ్య

డీజీపీ హైకోర్టులో తప్పు చేసిన వాడిగా నిలబడటానికి ముఖ్యమంత్రే కారణమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. పోలీసు వ్యవస్థ నడవడిక మీద ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో నిన్న బయటపడిందని దుయ్యబట్టారు.

Varla ramaih comments on police
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

By

Published : Mar 13, 2020, 11:57 PM IST

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

డీజీపీ హైకోర్టుకు వచ్చి సంజాయిషీ ఇవ్వడం భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య దుయ్యబట్టారు. రాష్ట్రంలో అస్తవ్యస్థ అరాచక పాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. పోలీస్ చరిత్రలో మార్చి 12 ఓ చీకటి రోజన్న వర్ల... తప్పు చేసిన వారిలా డీజీపీ అలా నిలబడటానికి ముఖ్యమంత్రే బాధ్యులని ధ్వజమెత్తారు. సీఎం ఆలోచన సరళిని అనుసరించటం వల్లే డీజీపీ సవాంగ్ దాదాపు 6 గంటలు కోర్టులో ఉండాల్సి వచ్చిందని మండిపడ్డారు. జరిగిన పరిణామాలకు సీఎం రాజీనామా చేసి తలదించుకోవాలని వర్ల డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ నడవడిక మీద ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో నిన్న బయటపడిందని దుయ్యబట్టారు. పోలీసు అధికారులు సంఘం ఇప్పుడు కూడా హైకోర్టు మీద తొడకొట్టి మీసాలు మెలేస్తుందా అని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details