'ఖాకీ విప్పి రాజకీయాల్లోకి రావాలి' - విజయవాడ
హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పోలీసు అధికారిగా కాకుండా రాజకీయనాయకుడిలా మాట్లాడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు.
!['ఖాకీ విప్పి రాజకీయాల్లోకి రావాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2614456-526-01dd5de5-9f50-4c18-a2fd-227a2c6f61cd.jpg)
హైదరాబాద్లోనిసైబరాబాద్పోలీస్ కమిషనర్ సజ్జనార్ గైడెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. ఆయన మీడియా ఛానల్స్ ను పిలిచి విడివిడిగా ఇంటర్వూలు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పరమైన ఆసక్తి ఉంటే ఖాకీ చొక్కా విప్పి రాజకీయాల్లోకి రావాలన్నారు. సీపీ వ్యవహర శైలి ప్రజాస్వామ్యాన్ని అవమాన పరిచేలా ఉందన్నారు. హైదరాబాద్ లో డ్యూటీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల పై సజ్జనార్ ఎలా కేసులుపెడతారని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానికి ఏపీ పోలీసుల రాకపై అభ్యంతరం ఉంటే గవర్నర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. ఓపెన్ డొమైన్ లో ఉన్న సమాచారం విషయాన్నితప్పు పట్టడం సరికాదన్నారు. సజ్జనార్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతితో డిఫెమేషన్ కేసు వేసే విషయం పరిశీలిస్తామని తెలిపారు.