ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపినందుకే.. దాడి చేశారు: వర్ల - తెదేపా నేత పట్టాభి కారుపై దాడి వార్తలు

తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిని పార్టీ సీనియర్‌ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పరామర్శించారు. ధ్వంసమైన కారును పరిశీలించారు.

varla ramaiah visit pattabhi home
varla ramaiah visit pattabhi home

By

Published : Oct 4, 2020, 3:14 PM IST

ప్రభుత్వ తప్పులను పట్టాభి ఎత్తి చూపించినందుకే దాడి చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. పట్టాభి కారుపై దాడి చేసిన వారిని 24 గంటల్లో పోలీసులు పట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

చంద్రబాబును ఉద్దేశించి మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలను ఆయన సతీమణి సైతం అంగీకరించరని చెప్పారు. కృష్ణదాస్ లా తామూ మాట్లాడగలం కానీ.. తెలుగుదేశం పార్టీ తమకు సభ్యత నేర్పిందని చెప్పారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే కాలం దగ్గర పడిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details