ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ పేరుపై బ్లాక్ పేయింట్​ వేసి.. రాజధానిని నడిపించండి' - అమరావతి రైతుల వార్తలు

అభివృద్ధి చేయమని ప్రజలు గెలిపిస్తే.. ప్రాంతాల మధ్య ముఖ్యమంత్రి జగన్ చిచ్చు పెడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఆయనలో నెపోలియన్, హిట్లర్ కనిపిస్తున్నారని విమర్శించారు.

varla ramaiah on ysrcp govt decision about amaravathi
varla ramaiah on ysrcp govt decision about amaravathi

By

Published : Jan 8, 2020, 5:14 PM IST

వైకాపా నేతలపై వర్లరామయ్య విమర్శలు

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. అవసరం లేని రిపోర్టులు, స్వామిజీ సూచనలను జగన్ పరిగణలోకి తీసుకోవడం దారుణమని దుయ్యబట్టారు. ప్రజలు ప్రశ్నిస్తారని వైకాపా నేతలు తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకవేళ చంద్రబాబు పేరు కనిపించొద్దు అని ఉంటే.. ఎక్కడైనా బోర్డులపై పేరుంటే బ్లాక్ పెయింట్ వేయాలని సూచించారు. భావితరాల భవిష్యత్ గురించి ముఖ్యమంత్రికి చింతలేదని.. వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి పేరుతో ఉద్యమాన్ని అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పిన్నెల్లి దాడి ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపించాలని వర్ల రామయ్య కోరారు. వైకాపా నేతలు, మంత్రుల బూతు పురాణం అంబటికి వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details