Varla Ramaiah Meet chief Electoral Officer:ఓటరు జాబితాలో లోపాలు సవరించాలని కోరుతూ.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్‌ను కలిశారు. ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే బూత్‌లో ఉండేలా చూడటంతో పాటు.. చనిపోయిన వ్యక్తుల పేర్లు తొలగించాలని కోరారు. వలస వచ్చిన వారి ఓట్లు ఇంకా కొనసాగుతున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఒక వ్యక్తి అనేక నియోజకవర్గాలల్లో ఓటు కలిగి ఉన్నారని, గ్రామ రెవెన్యూ అధికారులు అధికార వైకాపాకు అనుకూలంగా ఉన్నవారి ఓట్లు మాత్రమే చేర్చి.. ఇతర పార్టీల ఓట్లను తొలగిస్తున్నారన్నారని ఆరోపించారు. ఓటరుకు బయోమెట్రిక్ చేయటం ద్వారా దొంగ ఓట్లు పూర్తిగా నిరోధించవచ్చునని వర్ల సూచించారు.