ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై మానవ హక్కుల కమిషన్​కు వర్ల రామయ్య లేఖ

రాష్ట్రంలో అట్టడుగు వర్గాల వారిపై జరుగుతున్న దాడుల గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్​కు తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. దీనిపై కమిషన్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

varla ramaiah letter to nhrc
వర్ల రామయ్య, తెదేపా నేత

By

Published : Jul 23, 2020, 12:41 PM IST

Updated : Jul 23, 2020, 1:13 PM IST

రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్​కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో అనాగరిక పాలన నడుస్తోందని.. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఎస్సీలు, బీసీలు, మహిళలు, అట్టడుగు వర్గాల వారిపై దాడులు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు.

ఇసుక మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు. ఇందుకు వరప్రసాద్​పై దాడి ఉదాహరణ అని అన్నారు. అధికారులను వేకెన్సీ రిజర్వులో పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని.. దీనివలన ఆయా అధికారులు 50 శాతం జీతం కోల్పోతున్నారని ఆక్షేపించారు. ప్రభుత్వం చెప్పినట్లు వినకపోతే తమనూ రిజర్వ్​లో పెడతారేమో అనే భయంతో మిగిలినవారు బాధితులకు న్యాయం చేయడానికి భయపడుతున్నారన్నారు. 2019 జూన్ నుంచి ఈ విధమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కమిషన్​ను వర్ల కోరారు.

Last Updated : Jul 23, 2020, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details