ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ భూమిని వైకాపా ఎంపీ ఆక్రమించారు: వర్ల - వైకాపా ఎంపీపై వర్ల రామయ్య కామెంట్స్

గుంటూరు జిల్లా మందడంలో 15సెంట్ల పోరంబోకు స్థలాన్ని వైకాపా స్థానిక ఎంపీ, అతని అనుచరులు ఆక్రమించారని సీఆర్​డీఏ కమిషనర్​కు తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

varla ramaiah letter to crda commissioner on Land occupation
varla ramaiah letter to crda commissioner on Land occupation

By

Published : May 24, 2020, 3:41 PM IST

గుంటూరు జిల్లా మందడంలోని పోరంబోకు భూమి ఆక్రమణకు గురైందని సీఆర్​డీఏ కమిషనర్​కు తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఏపీ సచివాలయానికి అతి సమీపంలో ఎప్పటినుంచో ఆ భూమి ఉందని వర్ల లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ స్థలాన్ని ఎంపీ, అతని అనుచరులు ఆక్రమించడంపై మండిపడ్డారు. స్థానిక పోలీసులకు ఈ వ్యవహారం తెలిసినా.. అధికార పార్టీ నేతల హస్తం ఉండటంతో ఏమీ మాట్లాడటం లేదని వర్ల ఆరోపించారు. పోరంబోకు స్థలాన్ని ఆక్రమించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వర్ల డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details