దేవినేని ఉమాపై ఆయన ఇంట్లోనే దాడి చేస్తానని కొడాలి నాని ప్రకటించటం నేరపూరితమని తెదేపా నేత వర్లరామయ్య మండిపడ్డారు. మంత్రిపై కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై పాస్టర్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలను బూతుల మంత్రి సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ చేసిన బహిరంగ ప్రకటనల వీడియోలు ఏడాది నుంచి హల్చల్ చేస్తున్నాయన్న వర్ల..అలాంటి వ్యక్తిని ఎందుకు రక్షిస్తున్నారని నిలదీశారు.
మంత్రి కొడాలి నానిని అరెస్టు చేయాలి: వర్ల రామయ్య - వర్ల రామయ్య తాజా వార్తలు
దేవినేని ఉమాపై ఆయన ఇంట్లోనే దాడి చేస్తానని కొడాలి నాని ప్రకటించటం నేరపూరితమని.. మంత్రిపై కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని తెదేపా నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై పాస్టర్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సమర్థిస్తారా? అని నిలదీశారు.
మంత్రి కొడాలి నానిని అరెస్టు చేయాలి