వైకాపా నేతల తీరుపై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అభ్యంతరం చెప్పారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు విపత్తు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిలదీశారు. భౌతిక దూరం పాటిస్తూ తెలుగుదేశం నేతలు పేదలకు సేవ చేస్తుంటే... వారిపై మాత్రం కేసులు పెడుతున్నారని వర్ల మండిపడ్డారు. ఎంపీ విజయసాయిరెడ్డి షటిల్ సర్వీస్ లా తిరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
వైకాపా నేతలపై డీజీపీకి తెదేపా నేత వర్ల ఫిర్యాదు - తెదేపా నేత వర్ల రామయ్య
వైకాపా నేతలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీకి ఫిర్యాదు చేశారు.

తెదేపా నేత వర్ల రామయ్య