ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ లేఖను తేలిగ్గా తీసుకోం.. సరైన చోట తేల్చుకుంటాం' - వర్ల రామయ్య తాజా వార్తలు

జడ్జి సోదరుడు రామచంద్రపై దాడి ఘటనపై డీజీపీ గౌతం సవాంగ్ చంద్రబాబుకు రాసిన లేఖపై ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. ఆ లేఖను తేలిగ్గా తీసుకోబోమని.. ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

varla ramaiah
వర్ల రామయ్య, తెదేపా నేత

By

Published : Sep 30, 2020, 7:06 PM IST

డీజీపీ గౌతం సవాంగ్​పై తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుకు డీజీపీ రాసిన లేఖను అంత తేలిగ్గా వదలబోమని.. ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటామని అన్నారు. ఆ లేఖ ముమ్మాటికీ అనైతికం, రాజ్యాంగానికి విరుద్ధమని విమర్శించారు. ఆర్టికల్ 19ను హరించే హక్కు డీజీపీకి లేదని చెప్పారు. ఎవరి మెప్పుకోసం డీజీపీ ఇలా చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

పోలీస్ సంఘం ప్రతినిథులపైనా వర్ల విమర్శలు గుప్పించారు. వారు స్పందించాల్సిన చోట స్పందిస్తే మంచిదని హితవు పలికారు. వీఆర్​లో ఉన్న పోలీసుల సమస్యలపైనా.. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న సిబ్బంది వెతలపైనా సంఘం నేతలు స్పందిస్తే మంచిదన్నారు. అధికార పార్టీ నేతలు పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే సదరు సంఘం ఎందుకు మౌనంగా ఉంటోందని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details