నెల్లూరు జిల్లా వైకాపా నేతల పంచాయితీని తితిదే ఛైర్మన్ ఇంట్లో ఎలా నిర్వహిస్తారని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. రాజకీయ పంచాయితీని తన నివాసంలో చేయాల్సిన అవసరం ఏంటనీ వై.వి.సుబ్బారెడ్డిని నిలదీశారు. మహిళా ఎంపీడీవో ఘటనపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంలో ప్రభుత్వం తూతూ మంత్రంగా వ్యవహరించిందని మండిపడ్డారు. సీఎంకు నైతిక విలువలు ఉంటే శ్రీధర్ రెడ్డిని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని వర్ల డిమాండ్ చేశారు. సోషల్ మీడియా పోస్టులపై చర్చకు వైకాపా సిద్ధమా అని వర్ల సవాల్ విసిరారు. సీఎం వస్తే చర్చించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
'కోటంరెడ్డిపై ప్రభుత్వ చర్యలేవి..!'
నెల్లూరు ఎంపీడీవో ఘటనలో ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు తూతూమంత్రంగా ఉందని తెదేపా నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తితిదే ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఇంట్లో రాజకీయ పంచాయితీ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.
'రాజకీయ పంచాయితీని తితిదే ఛైర్మన్ ఇంట్లో ఎలా నిర్వహిస్తారు?'
TAGGED:
varla ramaia