రాష్ట్ర ప్రభుత్వ ఫాసిస్టు ధోరణికి రైతులకు వేసిన సంకెళ్లే నిదర్శనంగా నిలుస్తున్నాయని వర్ల రామయ్య విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఖరి ఇప్పటికైనా మారాలని కోరారు. పలు దఫాలుగా సుప్రీం కోర్టు ఆదేశించినా రైతులకు సంకెళ్లు వేయడం న్యాయవ్యవస్థలను ధిక్కరించడమే అవుతుందని వర్ల తన లేఖలో ప్రస్తావించారు. రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్‌కు భంగం కలిగించి వారి హక్కులు హరించిన ప్రభుత్వంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల చేతులకు బేడీలకు సంబంధించిన దృశ్యాలను కూడా తన లేఖతో జతచేశారు.
రైతులకు సంకెళ్లు వేయడంపై ఎన్హెచ్ఆర్సీకి వర్ల లేఖ
అమరావతి రైతులకు సంకెళ్లు వేయడంపై తెదేపా నేత వర్ల రామయ్య... జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. కరుడుకట్టిన నేరస్థులకు, దేశ భద్రతకు భంగం కలిగించే ఉగ్రవాదులకు వేసే సంకెళ్లు.. ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులకు వేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.
రైతులకు సంకెళ్లు వేయడంపై ఎన్హెచ్ఆర్సీకి వర్ల లేఖ