ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతాలు రద్దు - varalaxmi vrathas suspended in indrakeeladri due to corona

ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతాలు కరోనా దృష్ట్యా రద్దయ్యాయి. ఆన్​లైన్​లో రూ.1,500 చెల్లించిన భక్తుల పేరిట పూజ చేయిస్తామని ఈవో తెలిపారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

కరోనా దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతాలు రద్దు
కరోనా దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతాలు రద్దు

By

Published : Jul 27, 2020, 8:47 PM IST

కరోనా దృష్ట్యా విజయవాడ ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆన్‌లైన్‌లో రూ.1,500 చెల్లించిన భక్తులకు పరోక్షంగా వారి పేరిట గోత్రనామాలతో పూజ చేయిస్తామని ఈవో తెలిపారు. అనంతరం ఖడ్గమాల చీర, కుంకుమ, ప్రసాదం పోస్టు ద్వారా భక్తులు అందజేస్తామని చెప్పారు.

ఈ నెల 31 ఉదయం 8 గంటలకు ఆలయంలో వరలక్ష్మీ వ్రతం ఉంటుందని పేర్కొన్నారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details