ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్ర ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోంది' - news on DWACRA LADIES IN ANDHRAPRADES

రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మోసం చేస్తోందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. సీఎం జగన్​ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట తప్పారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

vangalapudi anitha latest meeting on DWACRA LADIES
vangalapudi anitha latest meeting on DWACRA LADIES

By

Published : Apr 23, 2020, 5:11 PM IST

ప్రభుత్వంపై తెదేపా నాయకురాలు అనిత విమర్శలు

సున్నా వడ్డీ పథకం పేరుతో వైకాపా ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మోసం చేస్తోందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. మహిళలను ఆదుకుంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌... ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని మహిళా మంత్రులు పట్టించుకోరా అంటూ అనిత ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details